చంద్రబాబు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని గవర్నర్ ను కోరాం: కన్నా లక్ష్మీనారాయణ
- డేటా చోరీ కేసును సీబీఐ విచారించాలి
- ఈ కేసులో ఏపీ పోలీసులు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు
- 5 కోట్ల ఆంధ్రుల డేటాను ట్యాంపర్ చేశారు
5 కోట్ల ఆంధ్రుల డేటాను ట్యాంపర్ చేశారని కన్నా మండిపడ్డారు. అధికారులు ప్రభుత్వం కోసం పని చేస్తున్నారని విమర్శించారు. ప్రతి చిన్న కేసుపై ముఖ్యమంత్రి సహా అందరు అధికారులు మాట్లాడుతున్నారని అన్నారు. గవర్నర్ కు అన్ని విషయాలను వివరించామని చెప్పారు.