rai lakshmi: 'వేరీజ్ ద వెంకటలక్ష్మీ' నుంచి ఆకట్టుకుంటోన్న లిరికల్ వీడియో సాంగ్

  • మరోసారి గ్లామరస్ పాత్రలో రాయ్ లక్ష్మి 
  • మనసుకి పట్టుకుంటోన్న పాటలు
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు    

తెలుగు తెరకి సరికొత్త సౌందర్యాన్ని అద్దిన కథానాయికలలో రాయ్ లక్ష్మి ఒకరు. అడపాదడపా ఐటమ్ సాంగ్స్ తోను అదరగొట్టేస్తోన్న రాయ్ లక్ష్మి, నాయిక ప్రాధాన్యత కలిగిన 'వేరీజ్ ద వెంకటలక్ష్మీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ ను వదిలారు.

" సమంతకి దిమ్మదిరిగే సొగసురా .. తమన్నాకి కళ్లు తిరిగే తళుకురా .. అనుపమ .. మెహరీన్ .. హన్సిక .. అదిరిపడే అందగత్తెర .." అంటూ ఈ పాట సాగుతోంది. రాయ్ లక్ష్మి సౌందర్యానికి ఆకర్షితులై ప్రవీణ్ .. మధునందన్ పాడుకునే పాటగా ఇది తెరపై ఆవిష్కరించబడుతుందని అనుకోవచ్చు.

 సురేశ్ బనిశెట్టి సాహిత్యం ..  హరి గౌర సంగీతం .. హరిణి - లోకేశ్వర్ - సాయిచరణ్ గానం ఆకట్టుకునేలా వున్నాయి. గ్లామర్ విషయంలో కథానాయికల ప్రత్యేకతలను చెబుతూ అల్లిన ఈ పాట చాలా బాగుంది. రాయ్ లక్ష్మి గ్లామర్ ప్రధానంగా రూపొందుతోన్న ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది

More Telugu News