మేనిఫెస్టో కమిటీతో జగన్ కీలక భేటీ!
- మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు
- మేనిఫెస్టోపై దృష్టి సారించిన జగన్
- జిల్లాల పర్యటనల తరువాత కమిటీతో భేటీ
వైసీపీ మేనిఫెస్టో కమిటీలో 31మంది సభ్యులుండగా, పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి అధ్యక్షత వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కమిటీ ఇటీవల జిల్లాల పర్యటనలు జరిపి, కార్యకర్తలు, ప్రజలతో సమావేశమై, వారి కోరికలను తెలుసుకుంది. ఆయా వివరాలను నేడు జగన్ తో పంచుకోగా, కమిటీ ప్రతిపాదించిన అంశాలను దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టోకు తుది రూపు ఇవ్వాలని జగన్ భావిస్తున్నారని సమాచారం.