Andhra Pradesh: అసమ్మతి నేతలపై చంద్రబాబు కన్నెర్ర.. అమరావతికి వచ్చి సంజాయిషీ ఇవ్వాలని ఆదేశం!

  • ఇలాంటి చర్యలను నేను సహించను
  • ఏదైనా ఉంటే నన్ను కలిసి చెప్పుకోండి
  • టీడీపీ రెబెల్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో టికెట్ దక్కని అసంతృప్త నేతలు సొంత పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా సమావేశాలు పెట్టుకోవడంపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. ఇలాంటి చర్యలను తాను సహించబోనని స్పష్టం చేశారు. తాను అందరి అభిప్రాయాలను తీసుకుంటాననీ, ఏదైనా సమస్య ఉంటే తనను కలిసి చెప్పుకోవాలని సూచించారు.

అంతేతప్ప ఇలా నేతలు సమావేశాలు పెట్టుకోవద్దనీ, అది క్రమశిక్షణా రాహిత్యమని స్పష్టం చేశారు. పార్టీకి వ్యతిరేకంగా సమావేశాలు పెట్టిన అసంతృప్త నేతలందరూ అమరావతికి రావాలని చంద్రబాబు ఆదేశించారు. తమ చర్యలపై సంజాయిషీ ఇచ్చుకోవాలని సూచించారు. తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుకు వ్యతిరేకంగా కొందరు టీడీపీ అసంతృప్త నేతలు సమావేశాలతో పాటు ర్యాలీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఘాటుగా స్పందించినట్లు తెలుస్తోంది.

More Telugu News