బెంగళూరులో రాత్రికి రాత్రే మాయమైన వందేళ్లనాటి మర్రిచెట్టు!
- శతాబ్దం చరిత్ర కలిగిన మర్రి చెట్టును నరికేసిన దుండగులు
- గురువారం రాత్రి కనిపించిన చెట్టు శుక్రవారం ఉదయం మాయం
- చెట్టు మాయంపై భిన్న కథనాలు
చెట్టు మాయమవడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు కావాలనే దానిని నరికివేశారని చెబుతుండగా, అటవీ అధికారులే చెట్టును నరికేసి తరలించారని మరికొందరు ఆరోపిస్తున్నారు. సమీపంలో ఉన్న షాప్ కీపర్ పనేనని ఇంకొందరు అనుమానిస్తున్నారు. ఓ సామాజిక కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.