Pakistan: సొంత ప్రజల చేతిలో దాడికి గురైన పాకిస్థాన్ పైలట్ మృతి!

  • బుధవారం కుప్పకూలిన పాక్ ఎఫ్-16
  • తమ భూభాగంలోనే దిగిన పైలట్ షాజుద్దీన్
  • భారత పైలట్ అనుకుని దాడి
  • చికిత్స పొందుతూ మృతి

విధి ఎంతో బలీయమైనది. విమానం కూలిపోగా, శత్రుదేశం భూభాగంపై పడిపోయిన భారత పైలట్ అభినందన్ వర్ధమాన్, ప్రాణాలతో బయటపడి, క్షేమంగా ఇండియాకు చేరుకోగా, ఇదే తరహా ప్రమాదంలో తన భూభాగంలోనే పడిపోయిన పాకిస్థాన్ పైలట్ తలరాతను మాత్రం దేవుడు మరోలా రాశాడు. తమకు కనిపించిన తమ పైలట్ ను భారతీయ పైలట్ అనుకున్న పాకిస్థాన్ ప్రజలు, దారుణంగా కొట్టగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న షాజుద్దీన్ అనే పైలట్ మరణించాడు.

గత బుధవారం నాడు ఎఫ్-16 విమానం నడుపుతూ, భారత గగనతలంలోకి షాజుద్దీన్ రాగా, అభినందన్ తమ మిగ్ విమానంతో దాన్ని తరుముకుంటూ వెళ్లాడు. ఈ ఘటనలో రెండు విమానాలూ కూలాయి. షాజుద్దీన్ ప్యారాచూట్ సాయంతో నౌషేరా సమీపంలోని లీమ్ లోయలో పడిపోయాడు. షాజుద్దీన్ కిందకు వస్తుండటాన్ని చూసిన కొందరు స్థానిక యువకులు, అతను కిందకు దిగగానే దాడిచేశారు.

పాక్ యూనిఫామ్ కనిపిస్తున్నా, భారత పైలట్ గా భావించి, ఆగ్రహంతో చితక్కొట్టారు. ఈ దాడిలో అతని అంతర్గత అవయవాలు దెబ్బతిన్నాయి. ఇతను కూడా భారత పైలట్ అని భావించిన పాక్ వర్గాలు ఇద్దరు పైలట్లు తమకు చిక్కారని తొలుత ప్రకటించాయి. స్థానిక మూకల దాడి నుంచి అభినందన్ ను రక్షించిన పాక్ సైనికులు, తమ పైలట్ ను మాత్రం రక్షించుకోలేక పోవడం గమనార్హం.

More Telugu News