chalapathi rao: సహాయం చేయడంలో ఎన్టీఆర్ తరువాతే ఎవరైనా: సీనియర్ నటుడు చలపతిరావు

  • అందుకే సినిమాలు తీశాను 
  • డబ్బుపై పెద్ద వ్యామోహం లేదు
  •  రామారావుగారి గొప్పతనం అదే    

ఎన్నో వైవిధ్యభరితమైన చిత్రాల్లో .. పాత్రల్లో చలపతిరావు నటించారు. ఇప్పటికీ ఆయన నటుడిగా తన ప్రత్యేకతను చాటుకుంటూనే వున్నారు. తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "మొదటి నుంచి కూడా నా చుట్టూ వున్న వాళ్లు బాగుండాలని కోరుకునే మనిషిని నేను. నా వలన ఓ నలుగురికి పని దొరుకుతుంది గదా అనే ఉద్దేశంతోనే కొన్ని సినిమాలను నిర్మించాను.

డబ్బే సంపాదించుకోవాలనుకుంటే రామారావుగారితో గల పరిచయంతో ఆయనతో సినిమాలు తీసేవాడిని .. కొన్ని కోట్లు సంపాదించేవాడిని. తన వలన ఎవరైనా నిర్మాత దెబ్బతింటే .. రామారావుగారు ఆ నిర్మాతకి తన డేట్లు కొన్ని ఇచ్చి అమ్ముకోమనేవారు. ఎవరైనా అవసరాల్లో .. ఆపదల్లో వుండి వచ్చినా ఆయన ఇదే పని చేసేవారు. అందరూ బాగుండాలనే ఆయన ఎప్పుడూ కోరుకునేవారు. అన్ని గొప్పగుణాలు ఉండటం వల్లనే రామారావుగారు ఆ స్థాయికి చేరుకున్నారు" అని చెప్పుకొచ్చారు.

More Telugu News