abhinandan: 'అభినందన్' అంటే ఇప్పటిదాకా అర్థం వేరు... ఇప్పుడు అర్థం మారింది: మోదీ

  • భారత్ ను ప్రపంచం ఇప్పుడు కొత్తగా అర్థం చేసుకుంటోంది
  • డిక్షనరీలోని పదాల అర్థాలను కూడా మార్చేస్తున్నాం
  • అభినందన్ ను ఉద్దేశించి మోదీ వ్యాఖ్య

భారత్ లో అభినందన్ అంటే ఇప్పటి వరకు స్వాగతం అని అర్థమని... ఇప్పుడు దాని అర్థం మారిందని ప్రధాని మోదీ అన్నారు. 'భారత్ అంటే ఏమిటో ప్రపంచం మొత్తం ఇప్పుడు కొత్తగా అర్థం చేసుకుంటోంది. డిక్షనరీలోని పదాల అర్థాలను సైతం మనం మార్చేస్తున్నాం' అంటూ వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ ను ఉద్దేశించి మాట్లాడుతూ మోదీ ఈ మేరకు వ్యాఖ్యానించారు.

పాక్ భూభాగంలో కి చొచ్చుకుపోయిన అభినందన్ ఆ దేశ ఎఫ్-16 అత్యాధునిక యుద్ధ విమానాన్ని కూల్చి, ఆ తర్వాత పాక్ సైన్యానికి దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత భారత దౌత్యం, అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గి అభినందన్ ను పాక్ విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. అభినందన్ రాక సందర్భంగా మోదీ అతన్ని అభినందిస్తూ ట్వీట్ కూడా చేశారు. 'తిరిగి వస్తున్న వింగ్ కమాండర్ అభినందన్ కు సుస్వాగతం. నీ ధైర్యసాహసాలను చూసి యావత్ దేశం గర్వపడుతోంది. 130 కోట్ల ప్రజల్లో భారత భద్రతాదళాలు స్ఫూర్తిని నింపుతున్నాయి. వందేమాతరం' అని ట్వీట్ చేశారు.

More Telugu News