తెలంగాణలో విషాదం.. ఎగ్జామ్ సెంటర్ లోనే ప్రాణాలు విడిచిన ఇంటర్ విద్యార్థి!
- తెలంగాణలోని సికింద్రాబాద్ లో ఘటన
- పరీక్ష రాస్తూ పడిపోయిన గోపీరాజ్
- మార్గమధ్యంలోనే చనిపోయినట్లు తేల్చిన వైద్యులు
గోపీరాజ్ ఎల్లారెడ్డిగూడ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. గోపీరాజు స్వస్థలం ఖమ్మం జిల్లా అని, మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న మృతుడి తండ్రి, సోదరుడు ఆసుపత్రికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు.