India: ఐఏఎఫ్ పైలట్ అభినందన్ విడుదలకు గ్రీన్ సిగ్నల్.. పిటిషన్ ను కొట్టివేసిన లాహోర్ హైకోర్టు!

  • అభినందన్ ను విడుదల చేయొద్దంటూ పిటిషన్
  • పిటిషన్ కు అసలు విచారణార్హత లేదన్న హైకోర్టు
  • నేడు సాయంత్రం 4 గంటలకు అభినందన్ విడుదల

భారత వాయుసేన(ఐఏఎఫ్)కు చెందిన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ను ఈరోజు విడుదల చేసేందుకు పాకిస్థాన్ అంగీకరించిన సంగతి తెలిసిందే. అయితే అభినందన్ విడుదలకు వ్యతిరేకంగా కొందరు పాకిస్థానీలు అడ్డుపుల్లలు వేసేందుకు ప్రయత్నించారు. లాహోర్ హైకోర్టుతో పాటు ఇతర న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు చేశారు. అభినందన్ వర్ధమాన్ ను విడుదల చేయకుండా అడ్డుకోవాలని కోరారు.

తాజాగా లాహోర్ హైకోర్టు అభినందన్ విడుదలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను విచారించింది. ఈ సందర్భంగా ఈ పిటిషన్ కు ఎలాంటి విచారణ అర్హత లేదని అభిప్రాయపడ్డ ధర్మాసనం దాన్ని కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో అభినందన్ విడుదలపై కొనసాగుతున్న సందిగ్ధత వీడింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు వాఘా-అట్టారి బోర్డర్ లో అభినందన్ ను పాక్ సైన్యం భారత్ కు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.

More Telugu News