యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ తప్పే: అమిత్ షా
- ఎన్ని భారత యుద్ధవిమానాలు పోతే అన్ని ఎక్కువ సీట్లు వస్తాయన్న యడ్డీ
- రాజకీయ వ్యాఖ్యలు చేసుండాల్సింది కాదు
- 'ఇండియా టుడే కాన్ క్లేవ్' లో అమిత్ షా
దేశం సంక్షోభంలో ఉన్న వేళ, విపక్షాలు బాధ్యతా రాహిత్యాన్ని ప్రదర్శిస్తున్నాయని విమర్శించిన ఆయన, ఉగ్రవాదులపై వాయుసేన దాడులు చేస్తే, ప్రతిపక్షాలు చర్చలంటూ గగ్గోలు పెట్టాయని అన్నారు. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో చర్చలతో సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదని ప్రశ్నించారు. పాకిస్థాన్ మాట నిలుపుకోవడం లేదని నిప్పులు చెరిగిన ఆయన, పుల్వామాలో సైన్యం కాన్వాయ్ పై జరిగిన దాడిని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంతవరకూ ఖండించలేదని గుర్తు చేశారు. కాగా, భారత్ జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్ బీజేపీకి లాభిస్తాయని, కర్ణాటకలో తమ పార్టీ 22 సీట్లను గెలుచుకోవడం ఖాయమని యడ్యూరప్ప వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.