Palaniswamy: తమిళనాడు సీఎం పళనిస్వామికి తృటిలో తప్పిన ముప్పు!

  • మధురైకి బయలుదేరిన విమానం
  • గాల్లోకి ఎగరగానే సాంకేతిక లోపం
  • విమానాన్ని సేఫ్ ల్యాండింగ్ చేసిన పైలట్

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి ఈ ఉదయం తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో, పైలట్ చాకచక్యంగా వ్యవహరించి, విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ చేశాడు. ఈ ఉదయం చెన్నై నుంచి మధురైకి బయలుదేరారు పళనిస్వామి.

విమానం టేకాఫ్ కాగానే, ఇంజన్ లో లోపం తలెత్తినట్టు గుర్తించిన పైలట్, విషయాన్ని గ్రౌండ్ స్టాఫ్ కు తెలిపి, ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఏర్పాట్లు చేయాలని కోరాడు. ఆపై విమానాన్ని జాగ్రత్తగా దించాడు. ఈ లోపంతో విమానం పూర్తి ఎత్తునకు వెళితే, పెను ప్రమాదం జరిగివుండేదని తెలుస్తోంది. ఆపై పళనిస్వామి మరో విమానంలో మధురైకి వెళ్లిపోయారు. విమానం ఇంజన్ లో టెక్నికల్ ఫాల్ట్ ను ముందుగానే ఎందుకు గుర్తించలేదన్న విషయమై విచారణకు ఆదేశించినట్టు అధికారులు వెల్లడించారు.

More Telugu News