ఎఫ్ 16 పైకి ఆర్ - 73 క్షిపణిని ప్రయోగించిన అభినందన్!
- భారత్ భూభాగంలోకి చొరబడ్డ 24 యుద్ధ విమానాలు
- వాటిలో 8 ఎఫ్-16, 4 మిరాజ్-3, 4 జేఎఫ్-17
- మిగ్ 21కు పైలెట్‌గా అభినందన్
- 2 ఏఎంఆర్ఏఏఎం క్షిపణులను ప్రయోగించిన పాక్
మిగ్ 21కు చెందిన రెండు విమానాల్లో ఒకదానికి వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ పైలెట్‌గా ఉన్నారు. ఆయన ఎఫ్ 16 పైకి ఆర్ - 73 క్షిపణిని ప్రయోగించగా.. పాక్ ఎఫ్ - 16 కూడా రెండు ఏఎంఆర్ఏఏఎం క్షిపణులను ప్రయోగించడంతో వాటిల్లో ఒకటి అభినందన్ విమానాన్ని తాకింది. దీంతో ఎఫ్ 16 పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగంలో కూలిపోగా.. రెండు విమానాల్లోని పైలెట్లు నియంత్రణ రేఖకు అవతల దిగారు. ఆ తరువాత అభినందన్‌ను పాక్ తమ చెరలోకి తీసుకోవడం వంటి పరిణామాలన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే వీరిలో పాక్ ఎఫ్ 16 పైలెట్ల విషయం మాత్రం ఇప్పటి వరకూ సస్పెన్స్‌గానే ఉంది.