kalyan ram: '118' చూసిన ఎన్టీఆర్ ఆ మాట అన్నాడట!

  • ఎన్టీఆర్ కి ఈ సినిమా చూపించాను
  •  నిడివి తగ్గించే పని లేదన్నాడు
  • ఆనందాన్ని వ్యక్తం చేస్తోన్న నివేదా

కల్యాణ్ రామ్ కథానాయకుడిగా .. గుహన్ దర్శకత్వంలో '118' సినిమా రూపొందింది. మహేశ్ కోనేరు నిర్మించిన ఈ సినిమాలో కథానాయికలుగా నివేదా థామస్ .. షాలినీ పాండే నటించారు. రేపు ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ మాట్లాడుతూ .. ఈ సినిమాను ఎన్టీఆర్ కి చూపించాను.ఆయన ఈ సినిమా చూసి .. "చాలా బాగుంది .. కొత్తగా ట్రై చేశావ్. సినిమా నిడివిలో ఎక్కడా ఒక్క నిమిషం కూడా తగ్గించవలసిన అవసరం లేదు. నివేదా థామస్ నటన చాలా బాగుంది. ఆమెకి ఈ సినిమా మంచి పేరు తెస్తుంది" అని చెప్పాడు. ఇంతమంచి సినిమా చేసినందుకు నన్ను అభినందించాడు అని కల్యాణ్ రామ్ చెప్పుకొచ్చాడు. ఇక నివేదా థామస్ కూడా ఈ సినిమా తన క్రేజ్ ను మరింత పెంచుతుందనీ, తన కెరియర్ కి ఎంతో హెల్ప్ అవుతుందని అంటోంది. వాళ్ల నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి. 

More Telugu News