vijay devarakonda: 'డియర్ కామ్రేడ్' ఆ రోజున వచ్చే అవకాశాలే ఎక్కువ

  • మెడికల్ స్టూడెంట్ గా విజయ్ దేవరకొండ
  • క్రికెటర్ గా కనిపించనున్న రష్మిక
  • మే 22వ తేదీన విడుదల చేసే ఛాన్స్  

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా .. భరత్ కమ్మ దర్శకత్వంలో 'డియర్ కామ్రేడ్' రూపొందుతోంది. 'గీత గోవిందం' తరువాత విజయ్ దేవరకొండ .. రష్మిక మందన జంటగా నటిస్తోన్న సినిమా ఇది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మెడికల్ స్టూడెంట్ గా నటిస్తుండగా .. రష్మిక క్రికెటర్ గా కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

మే 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నారు. దాదాపు ఈ తేదీ ఖరారు కావొచ్చని అంటున్నారు. విజయ్ దేవరకొండ ఒకదానికొకటి పూర్తి భిన్నమైన సినిమాలను చేస్తూ విజయాలను అందుకుంటున్నాడు. ఈ సినిమా కూడా తన కెరియర్లో గుర్తుంచుకోదగినది అవుతుందని ఆయన భావిస్తున్నాడు. విజయ్ దేవరకొండ కాంబినేషన్లో మరో సక్సెస్ ను రష్మిక తన ఖాతాలో వేసుకుంటుందేమో చూడాలి.

More Telugu News