sensex: వెంటాడుతున్న యుద్ధ భయం.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన మార్కెట్లు
  • పాక్ విమానాన్ని కూల్చేశారన్న వార్తలపై నష్టాల్లోకి జారుకున్న వైనం
  • 68 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

భారత్-పాక్ ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో... దాని ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది. ఈ ఉదయం దేశీయ మార్కెట్లు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 260 పాయింట్లకు పైగా లాభాల్లో ట్రేడ్ అయింది. అయితే పాక్ కు చెందిన యుద్ధ విమానాన్ని భారత్ కూల్చి వేసిందన్న వార్తలతో మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 189 పాయింట్ల నష్టంతో కదలాడింది. ఆ తర్వాత కొంచెం కోలుకున్నప్పటికీ... చివరి గంటలో మళ్లీ నష్టాల్లోకి జారుకుంది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 68 పాయింట్ల నష్టంతో 35,905కి జారిపోయింది. నిఫ్టీ 28 పాయింట్లు కోల్పోయి 10,806 వద్ద స్థిరపడింది.

యస్ బ్యాంక్, భారతి ఇన్ఫ్రాటెల్, హిందుస్థాన్ యూనిలీవర్, టాటా మోటార్స్, వేదాంత తదితర కంపెనీలు నష్టాలను చవిచూశాయి. ఆల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఆటో, ఎల్ అండ్ టీ, సన్ ఫార్మా, భారతి ఎయిర్ టెల్ తదితర కంపెనీలు లాభాల్లో ముగిశాయి.

More Telugu News