India: మేం పట్టుకున్న భారత పైలెట్ ఇతడే.. వీడియోను విడుదల చేసిన పాకిస్థాన్ ఆర్మీ!

  • వింగ్ కమాండర్ అభినందన్ ను అరెస్ట్ చేశామన్న పాక్
  • ప్రాణాలతో పట్టుకున్నట్లు ప్రకటన
  • వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పాక్ ఆర్మీ

భారత వాయుసేనకు చెందిన రెండు యుద్ధ విమానాలను కూల్చివేశామనీ, ఓ పైలెట్ ను సజీవంగా పట్టుకున్నామని పాకిస్థాన్ ఈరోజు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాము పాకిస్థాన్ కు చెందిన ఎఫ్-16 యుద్ధవిమానాన్ని కూల్చివేశామని భారత్ ప్రకటించిన కొద్దిసేపటికే పాక్ ఈ మేరకు స్పందించింది. తాజాగా ఐఏఎఫ్ పైలెట్ కు సంబంధించిన వీడియోను పాకిస్థాన్ ఆర్మీ ఈరోజు విడుదల చేసింది. వింగ్ కమాండర్ విక్రమ్ అభినందన్ ను అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా అభినందన్ మాట్లాడుతున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

More Telugu News