India: ‘ఏయ్ పాకిస్థాన్..!’ అంటూ వర్మ.. ‘బుల్లెట్ దిగిందా? లేదా?’ అని పూరీ జగన్నాథ్ ట్వీట్లు!

  • పీఓకేపై భారత వైమానిక దళం దాడిపై హర్షం
  • నువ్వు ఒకటి కొడితే మేము నాలుగు కొడతాం: వర్మ
  • భారత వైమానిక దళానికి సెల్యూట్: పూరీ జగన్నాథ్
పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై జరిగిన ఆత్మాహుతి దాడిపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ వరుస ట్వీట్లతో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను ఏకి పారేసిన విషయం తెలిసిందే. తాజాగా, పీఓకేపై భారత వైమానిక దళం దాడులను ప్రశంసిస్తూ వర్మ తన ‘మార్క్’ ట్వీట్ చేశారు. ‘ఏయ్ పాకిస్థాన్, నువ్వు ఒకటి కొడితే మేము నాలుగు కొడతాం’ అని ట్వీట్ చేశారు.

మరో ప్రముఖ దర్శకుడు, వర్మ శిష్యుడు పూరీ జగన్నాథ్ కూడా స్పందించారు. ‘బుల్లెట్ దిగిందా లేదా?’ అని ట్వీట్ చేశారు. ‘భారత వైమానిక దళానికి సెల్యూట్.. జనగణమన’ అంటూ అభినందనలు తెలిపారు.

India
Pakistan
indian air force
ram gopal varma
Puri Jagannadh
directors
pm
imran khan

More Telugu News