Pakistan: రెండు లక్ష్యాలతో ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడిన భారత వాయుసేన

  • మొదటి లక్ష్యం ముఫ్తీ అజర్ ఖాన్
  • రెండవ లక్ష్యం ఇబ్రహీం అతార్
  • దట్టమైన అడవిలోని కొండపై స్థావరం

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత వాయుసేన విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే భారత వైమానిక దళం రెండు లక్ష్యాలతో ఈ సర్జికల్ స్ట్రైక్‌ను మొదలు పెట్టింది. మొదటి లక్ష్యం.. కశ్మీర్ ఆపరేషన్స్ హెడ్ ముఫ్తీ అజర్ ఖాన్ కాగా.. రెండవది.. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ పెద్ద సోదరుడు ఇబ్రహీం అతార్ అని సమాచారం.

దీనిలో భాగంగానే భారత విమానాలు జైషే శిక్షణ కేంద్రాన్ని ధ్వంసం చేశాయి. మసూద్ అజర్ బావమరిది యూసఫ్ అజర్ సారథ్యంలో ఈ కేంద్రం నడుస్తోంది. దట్టమైన అడవిలోని ఓ కొండపై ఈ స్థావరం ఉంది. దీని గురించి తమకు తెలియదని పాక్ చెబుతుండగా.. పాక్ ప్రభుత్వానికి తెలియకుండా ఈ స్థావరం ఇక్కడ కార్యకలాపాలు సాగించటం అసాధ్యమని భారత్ చెబుతోంది.

More Telugu News