India: బాంబులు ఖాళీ ప్రాంతంలో మాత్రమే పడ్డాయి... ఒక్కరు కూడా మరణించలేదు: పాకిస్థాన్

  • సరిహద్దులు దాటి విమానాలు వచ్చాయి.
  • 4 మైళ్ల లోపలికి వచ్చి బాంబులేశాయి
  • ట్విట్టర్ లో మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్
భారత యుద్ధ విమానాలు పీఓకే ప్రాంతంలో దాడులు జరిపి, భారీ ఎత్తున ప్రాణనష్టానికి కారణమైనట్టు వచ్చిన వార్తలను పాక్ సైన్యాధికారి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెడుతూ, "ముజఫరాబాద్  సెక్టార్ లో భారత విమానాలు సరిహద్దులను దాటి మూడు నుంచి నాలుగు మైళ్ల దూరం వచ్చాయి. అవి హడావిడిగా కొన్ని బాంబులను జారవిడిచాయి. అవి ఖాళీ ప్రాంతంలో పడ్డాయి. భవనాలు, ఇతర మౌలిక వసతులేవీ ధ్వంసం కాలేదు. ఒక్కరు కూడా మరణించలేదు. మరిన్ని వివరాలు కాసేపట్లో వెల్లడిస్తాం" అని ఆయన పేర్కొన్నారు.


India
Pakistan
POK
Fighter Jets
Surgicle Strikes

More Telugu News