28 ఏళ్ల మలయాళ సినీ దర్శకురాలి అనుమానాస్పద మృతి
- తన నివాసంలో విగతజీవిగా నయన సూర్యన్
- 2017లో దర్శకురాలిగా మారిన నయన
- అంతకు ముందు పలువురు దర్శకుల వద్ద అసిస్టెంట్ గా పని చేసిన నయన
నయనకు ఆమె తల్లి పలుమార్లు ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో... ఆమె కంగారుపడి, వెంటనే నయన స్నేహితులకు ఫోన్ చేసి విషయాన్ని తెలిపింది. నయన ఇంటికి వెళ్లిన స్నేహితులకు... బెడ్ రూమ్ లో ఆమె విగతజీవిగా కనిపించింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. అలప్పాడ్ కు చెందిన నయనకు తల్లిదండ్రులతో పాటు ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు.