'96' రీమేక్ టైటిల్ మార్చే ఆలోచనలో దిల్ రాజు?
- తమిళంలో హిట్ కొట్టిన '96'
- కొత్త టైటిల్ ఫిక్స్ చేసే పనిలో దిల్ రాజు
- ఉగాదికి సెట్స్ పైకి
తమిళంలో ఈ సినిమా నడిచిన కథాకాలం .. పాత్రలను మలిచిన తీరు చాలా సహజంగా అనిపిస్తాయి. అయితే ఎక్కడా కూడా కథలోని 'ఆత్మ' దెబ్బతినకుండా, తెలుగు నేటివిటీకి తగినట్టుగా కొన్ని మార్పులు చేయాలని దిల్ రాజు భావిస్తున్నాడట. కథలోని ఫీల్ ను దృష్టిలో పెట్టుకునే కొత్త టైటిల్ ను పెట్టాలనే ఆలోచన చేస్తున్నాడని అంటున్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాకి టైటిల్ ను సెట్ చేసుకుని, ఉగాది నుంచి ఈ సినిమా షూటింగును మొదలుపెట్టేలా సన్నాహాలు చేస్తున్నట్టుగా చెబుతున్నారు. తెలుగులో ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.