renu desai: రైతు కుటుంబాలను కలవడానికి.. కర్నూలు జిల్లాకు చేరుకున్న రేణుదేశాయ్

  • నిన్న రాత్రి మంత్రాలయం చేరుకున్న రేణు
  • ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు పరామర్శ
  • రైతు సమస్యల కథాంశంతో సినిమాను తెరకెక్కిస్తున్న రేణు
సినీ నటి రేణుదేశాయ్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. నిన్న రాత్రే ఆమె మంత్రాలయం చేరుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన ఇద్దరు రైతుల కుటుంబాలను ఈరోజు ఆమె పరామర్శించనున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు, బాధిత కుటుంబాల పరిస్థితిని అడిగి తెలుసుకోనున్నారు.

గత ఏడాది ఆగస్టులో ఆలూరు మండలం తుంబళబీడుకు చెందిన రామయ్య దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ తర్వాత డిసెంబర్ లో పెదకడబూరుకు చెందిన రైతు పెద్దరంగన్న ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రెండు గ్రామాల్లో నేడు ఆమె పర్యటించనున్నారు. రేణు దేశాయ్ పర్యటన సందర్భంగా ఆమెకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతు సమస్యల కథాంశంతో దర్శకురాలిగా ఓ చిత్రాన్ని ఆమె తెరకెక్కించబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రీన్ ప్లే వర్క్ కూడా పూర్తయింది.
renu desai
Kurnool District
tollywood

More Telugu News