Andhra Pradesh: హైజాక్ చేస్తామని బెదిరింపు ఫోన్ కాల్.. గన్నవరం విమానాశ్రయంలో హైఅలర్ట్!
- ఎయిర్ ఇండియా విమానాన్ని పాక్ కు తీసుకెళతామని హెచ్చరిక
- అప్రమత్తమైన భద్రతాధికారులు
- ప్రతీఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న సిబ్బంది
ఆంధ్రప్రదేశ్ లోని గన్నవరం విమానాశ్రయంలో ఈరోజు పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. గన్నవరం విమానాశ్రయంలోని ఎయిర్ ఇండియా విమానాన్ని హైజాక్ చేయబోతున్నామనీ, ఫ్లైట్ ను పాకిస్తాన్ కు తరలిస్తామని ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి అధికారులను హెచ్చరించాడు.
దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు హైఅలర్ట్ ను ప్రకటించారు. గన్నవరం ఎయిర్ పోర్టులో అదనపు బలగాలను మోహరించిన అధికారులు, లగేజ్, ప్రయాణికులను క్షుణ్ణంగా పరిశీలించాకే లోపలకు అనుమతిస్తున్నారు. కాగా, ఈ ఫోన్ కాల్ ఆకతాయి పని అయ్యుండొచ్చనీ, అయినా ఛాన్స్ తీసుకోలేమని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.