విజయనగరం జిల్లాలో ఏనుగుల బీభత్సం.. మందుగుండును పేల్చుతున్న అటవీశాఖ అధికారులు!
- గత 3 నెలలుగా రైతులకు చుక్కలు చూపుతున్న గజరాజులు
- వరి సహా ఇతర పంటలన్నీ నాశనం
- చర్యలు తీసుకుంటున్న అటవీశాఖ అధికారులు
ఈ సందర్భంగా ఓ రైతు మాట్లాడుతూ.. గత 3 నెలలుగా ఏనుగులు తమకు నిద్ర లేకుండా చేస్తున్నాయని తెలిపారు. రాత్రిపూట పంట పొలాల్లోకి దూసుకొచ్చి తొక్కి నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని కోరారు.