Andhra Pradesh: విజయనగరం జిల్లాలో ఏనుగుల బీభత్సం.. మందుగుండును పేల్చుతున్న అటవీశాఖ అధికారులు!

  • గత 3 నెలలుగా రైతులకు చుక్కలు చూపుతున్న గజరాజులు
  • వరి సహా ఇతర పంటలన్నీ నాశనం
  • చర్యలు తీసుకుంటున్న అటవీశాఖ అధికారులు

ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో ఏనుగులు రైతులకు నిద్రలేకుండా చేస్తున్నాయి. కష్టపడి పండించిన పంట పొలాల్లోకి చొరబడి బీభత్సం సృష్టిస్తున్నాయి. తాజాగా జిల్లాలోని జీఎం వలస మండలం వలస వెంకటరాజాపురంలో ఈరోజు ఏనుగులు వరి, ఇతర పంటలను ధ్వంసం చేశాయి. దీంతో రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు మందుగుండును పేలుస్తూ ఏనుగులను అడవిలోకి తరుముతున్నారు.

ఈ సందర్భంగా ఓ రైతు మాట్లాడుతూ.. గత 3 నెలలుగా ఏనుగులు తమకు నిద్ర లేకుండా చేస్తున్నాయని తెలిపారు. రాత్రిపూట పంట పొలాల్లోకి దూసుకొచ్చి తొక్కి నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని కోరారు.

More Telugu News