Delhi Govt: ఢిల్లీ రాష్ట్ర ఉద్యోగాల్లో మెరిసిన టాలెంట్ .. జనరల్ కేటగిరి అభ్యర్థుల కంటే ఎస్సీ అభ్యర్థుల కటాఫ్ ఎక్కువ!

  • సైన్స్ ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్
  • 2018 సెప్టెంబరులో జరిగిన పరీక్ష
  • ఓసీ కంటే ఎస్సీ అభ్యర్థుల కటాఫ్ ఎక్కువ

పోటీ పరీక్షల్లో కటాఫ్ మార్కులను ఎదుర్కొన్నామా.. ఉద్యోగం పక్కా. ఈ కటాఫ్ మార్కులను చేరుకోవడం కోసం అభ్యర్థులు అహర్నిశలు శ్రమిస్తుంటారు. సాధారణంగా ఈ కటాఫ్ మార్కులు జనరల్ కేటగిరి అభ్యర్థులకు ఎక్కువగాను.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు తక్కువగానూ వుంటాయి. ఎస్సీ, ఎస్టీల విషయానికి వచ్చేసరికి కటాఫ్ చాలా వరకూ తగ్గిపోతుంది. అయితే విచిత్రంగా ఓ పరీక్షలో మాత్రం జనరల్ కేటగిరీ అభ్యర్థుల కంటే ఎస్సీ అభ్యర్థులకే ఎక్కువగా కటాఫ్ మార్కులు నిర్ణయించారు.

ఢిల్లీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 222 సైన్స్ ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన పరీక్ష 2018 సెప్టెంబరులో జరిగింది. తాజాగా ఈ పరీక్షలకు సంబంధించి కటాఫ్ లిస్టును ప్రభుత్వం విడుదల చేసింది. దీనిని చూసిన అభ్యర్థులు ఆశ్చర్యానికి గురయ్యారు. జనరల్ కేటగిరి అభ్యర్థులకు 80.96, ఎస్సీ కేటగిరికి 85.45 కటాఫ్ మార్కులను, ఎస్టీలకు 69.31 మార్కులను కటాఫ్‌గా నిర్దేశించింది. 222 పోస్టుల్లో ఎస్సీలకు 31 పోస్టులను కేటాయించారు. దీనిని బట్టి ఎస్సీ అభ్యర్థుల మధ్య టాలెంట్ పరంగా ఏ రేంజ్‌లో పోటీ నెలకొందో అర్థం చేసుకోవచ్చు.

More Telugu News