Hyderabad: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన బైకర్.. అక్కడికక్కడే మృతి!

  • కూకట్ పల్లిలో రోడ్డు ప్రమాదం 
  • మృతి చెందిన వ్యక్తి పేరు శేఖర్
  • అతి వేగమే ప్రమాదానికి కారణం
హైదరాబాదులోని కూకట్‌పల్లిలో నేడు జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ఓ ఇంట విషాదాన్ని నింపింది. బైకుపై వెళుతున్న వాహన చోదకుడు ఆర్టీసీ బస్సును వెనుకనుంచి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. చనిపోయిన వ్యక్తి పేరు శేఖర్ అని తేలింది. అతి వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. స్థానికుల సమచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad
Kukatpally
Sekhar
RTC Bus
Road Accident

More Telugu News