తేజస్ యుద్ధ విమానానికి కోపైలట్ గా వ్యవహరించిన పీవీ సింధు

  • విమెన్స్ డే వేడుకలను నిర్వహించిన ఏరో ఇండియా
  • తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించిన సింధు
  • తేజస్ తొలి మహిళా కోపైలట్ గా
భారత ఏస్ షట్లర్ పీవీ సింధు సాహసం చేసింది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బెంగళూరులో ఏరో ఇండియా విమెన్స్ డే వేడుకలను ఈరోజు నిర్వహించింది. ఈ సందర్భంగా స్వదేశంలో తయారైన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ లో సింధు ప్రయాణించింది. ఈ విమానంలో ఇద్దరు పైలట్లు కూర్చునే వీలుంటుంది. వెనుక సీట్లో కూర్చొని విమానంలో సింధు ప్రయాణించింది. ఈ సందర్భంగా రక్షణశాఖ ప్రతినిధి మాట్లాడుతూ, తేజస్ యుద్ధ విమానానికి సింధు కోపైలట్ గా వ్యవహరించారని చెప్పారు. దీంతో, తేజస్ కు కోపైలట్ గా వ్యవహరించిన తొలి మహిళగా సింధు నిలిచింది.
Go Back to Shorts
PV Sindhu
tejas
jet
fly

More Telugu News