చంద్రబాబూ.. రాత్రికిరాత్రి హైదరాబాద్ నుంచి సర్దుకుని వచ్చేశారుగా.. అప్పుడెవరు వార్నింగ్ ఇచ్చారు?: విజయసాయిరెడ్డి

  • చంద్రబాబు వ్యాఖ్యలకు వైసీపీ నేత కౌంటర్
  • ఏపీ సీఎంకు ప్రపంచమంతటా ఆస్తులున్నాయని ఆరోపణ
  • ట్విట్టర్ లో విమర్శలు గుప్పించిన విజయసాయిరెడ్డి
హైదరాబాద్ లో ఆస్తులు ఉన్న టీడీపీ నేతలను వైసీపీలో చేరాల్సిందిగా కొందరు బెదిరిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా చంద్రబాబు ఆరోపణలపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రపంచమంతా ఆస్తులు ఉన్నాయనీ, ఆయన్ను ఎవరైనా బెదిరించారా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ రాజధానిగా పదేళ్ల గడువు ఉన్నప్పటికీ రాత్రికిరాత్రి ఎందుకు వచ్చేశారని అడిగారు. అప్పుడు చంద్రబాబుకు ఎవరు వార్నింగ్ ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ..‘టీడీపీ నాయకులను వైసీపీలో చేరమని హైదరాబాద్ లో బెదిరిస్తున్నారని నాయుడుబాబు కలవర పడుతున్నారు. మీకు ప్రపంచమంతా ఆస్తులున్నాయి. ఎవరైనా బెదిరించారా? 10 సంవత్సరాల రాజధానిని వదిలేసి రాత్రికి రాత్రి సర్దుకుని వచ్చింది తమరే కదా చంద్రం సారూ. అప్పుడెవరు వార్నింగ్ ఇచ్చారో చెప్పండి’ అని ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Andhra Pradesh
Chandrababu
Hyderabad
Telangana
warning
YSRCP
Telugudesam
Vijay Sai Reddy
Twitter

More Telugu News