relangi narasimha rao: 8 లక్షలతో నేను తీసిన సినిమా 100 రోజులు ఆడింది: దర్శకుడు రేలంగి నరసింహారావు

  • 75 సినిమాలకి దర్శకత్వం వహించాను
  •  బిలో యావరేజ్ అనిపించుకున్నవి 10 సినిమాలే
  • నా వలన నిర్మాతలు నష్టపోలేదు  

తెలుగు తెరకి హాస్య కథాచిత్రాలను పరిచయం చేసి .. కామెడీని పరుగులు తీయించిన దర్శకులలో రేలంగి నరసింహారావు ఒకరు. హాస్యంతో కూడిన కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. 75 సినిమాలకి దర్శకత్వం వహించిన ఆయన, ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరియర్ కి సంబంధించిన విషయాలను చెప్పుకొచ్చారు.

"ఈ రోజు వరకూ నేను 75 సినిమాలకి దర్శకత్వం చేశాను .. వాటిలో 65 సినిమాలు బాగా ఆడాయి .. మిగతావి బిలో యావరేజ్ అనిపించుకున్నాయి. నా సినిమాల వలన లాభాలు ఎక్కువగా పొందని నిర్మాతలు వున్నారు గానీ, నష్టపోయిన నిర్మాతలు మాత్రం లేరు. ఈ విషయాన్ని నేను గర్వంగా చెప్పగలను. నా సినిమాల్లో తక్కువ బడ్జెట్ తో చేసింది 'నేను .. మా ఆవిడ'. 8 లక్షలతో ఈ సినిమాను తెరకెక్కించాను. అలాంటి ఈ సినిమా 100 రోజులు ఆడేసింది .. మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఇక ఎక్కువ బడ్జెట్ పెట్టేసిన సినిమా 'ఎలుకా మజాకా'. కోటి డెబ్భై అయిదు లక్షలతో నిర్మితమైన ఈ సినిమా యావరేజ్ గా ఆడింది" అని చెప్పుకొచ్చారు. 

More Telugu News