Heart To Heart With Swapna: ప్రముఖ సినీ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూత

  • కొంత కాలంగా కోడి రామకృష్ణకు అనారోగ్యం
  • హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • తెలుగు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి
ప్రముఖ సినీ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూశారు. కొంత కాలంగా శ్వాసకోశవ్యాధితో ఆయన బాధపడుతున్నారు. హైదరాబాద్, గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ మరణించారు. కోడి రామకృష్ణ మృతిపై తెలుగు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కాగా, ఆయన తొలి చిత్రం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. వందకు పైగా చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. మంగమ్మ గారి మనవడు, గూఢచారి నం.1, ఆహుతి, శత్రువు, తలంబ్రాలు, భారతంలో బాల చంద్రుడు, స్టేషన్ మాస్టర్, అమ్మోరు, దేవి, దేవుళ్లు, అంజి, దేవీపుత్రుడు, అరుంధతి తదితర చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.
Heart To Heart With Swapna
director
kodi ramakrishna

More Telugu News