Telangana: లక్షలోపు వ్యవసాయ రుణాల మాఫీ.. తెలంగాణ బడ్జెట్ హైలైట్స్-2

  • నీటిపారుదల శాఖకు రూ. 22,500 కోట్లు
  • వ్యవసాయ శాఖకు రూ. 20,107 కోట్లు
  • ఈఎన్టీ, దంత పరీక్షల కోసం రూ. 5,536 కోట్లు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిందని... కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అందించే నిధులను బట్టి... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడుతుందని తెలిపారు.

బడ్జెట్ హైలైట్స్:

  • ఎంబీసీ కార్పొరేషన్ కు రూ. 1,000 కోట్లు
  • షెడ్యూల్ తెగల ప్రగతి నిధికి రూ. 9,827 కోట్లు
  • షెడ్యూల్ కులాల ప్రగతి నిధికి రూ. 16,581 కోట్లు
  • వ్యవసాయ శాఖకు రూ. 20,107 కోట్లు
  • నీటిపారుదల శాఖకు రూ. 22,500 కోట్లు
  • ఈఎన్టీ, దంత పరీక్షల కోసం రూ. 5,536 కోట్లు
  • డిసెంబర్ 11, 2018లోపు తీసుకున్న లక్షలోపు వ్యవసాయ రుణాల మాఫీ
  • పంచాయతీలకు 2 ఫైనాన్స్ కమిషన్ల నుంచి రూ. 3,256 కోట్లు
  • ఒక్కో మనిషికి రూ. 1,606 చొప్పున ఫైనాన్స్ కమిషన్ నిధులు
  • 500 జనాభా కలిగిన గ్రామానికి రూ. 8 లక్షల నిధులు
  • టీఎస్ఐపాస్ ద్వారా రూ. 1.41 లక్షల కోట్ల పెట్టుబడులు
  • పరిశ్రమల ద్వారా 8.58 లక్షల ఉద్యోగాలు వచ్చాయి
  • ఐటీ ఎగుమతులు రూ. లక్ష కోట్లకు చేరుకున్నాయి

More Telugu News