Telangana: ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు టీ-మంత్రి వర్గం ఆమోదం

  • సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం
  • పలు కీలక నిర్ణయాలు 
  • రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్
రేపు తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు మంత్రి వర్గం ఆమోదించింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించిన మంత్రి వర్గ సమావేశం ముగిసింది. మంత్రి వర్గ విస్తరణ తర్వాత తొలిసారిగా ప్రగతిభవన్ లో మంత్రి వర్గం సమావేశమైంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన డిమాండ్లకు అనుబంధ గ్రాంట్లకు, జీఎస్టీ సవరణ బిల్లుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. కాగా, ఈసారి బడ్జెట్ రెండు లక్షల కోట్ల రూపాయలు దాటవచ్చని భావిస్తున్నారు. 
Telangana
cabinet
vote on account
budget

More Telugu News