Telangana: ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి కోసం 13.36 లక్షల మంది రైతుల సమాచారం పంపిన తెలంగాణ సర్కారు

షార్ట్స్‌లో చూడండి
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి పథకం కోసం తెలంగాణ ప్రభుత్వం 13.36 లక్షల మంది రైతుల వివరాలను కేంద్రానికి పంపించింది. మొత్తం 25 లక్షల కుటుంబాలు ఈ పథానికి అర్హులు కాగా తొలి విడతలో భాగంగా ఇప్పటి వరకు 13.36 లక్షల మంది డేటాను కేంద్ర ప్రభుత్వ సర్వర్‌లో అప్‌డేట్ చేసినట్టు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి తెలిపారు. మిగతా లబ్ధిదారుల పేర్లను మార్చి 1 నాటికి అప్‌డేట్ చేయనున్నట్టు తెలిపారు.

ఇక, తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే సిద్ధిపేటలో అత్యధికంగా 79,417 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో నల్గొండ (77,345), నాగర్‌కర్నూలు (74,606), మేడ్చల్-మల్కాజిగిరి(5,414), మహబూబాబాద్ (14,707), భద్రాద్రి-కొత్తగూడెం (21,083) మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో జనరల్ కేటగిరీలో 9.4 లక్షల మంది, ఎస్సీ లబ్ధిదారులు 2.4 లక్షల మంది, ఎస్టీ లబ్ధిదారులు 1.4 లక్షల మంది ఉన్నారు.
Go Back to Shorts
Telangana
Farmers
Kisan Samman Nidhi
Siddipet District

More Telugu News