‘జనసేన’ ఆశావహుల బయోడేటాల స్వీకరణకు తుదిగడువు ఈ నెల 25
- బయోడేటాలను సమర్పిస్తున్న ఆశావహులు
- స్క్రీనింగ్ కమిటీకి ఈరోజు 170 బయోడేటాల సమర్పణ
- ఉత్తరాంధ్ర, రాయలసీమ నుంచి అధికంగా ఆశావహులు
విజయవాడలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో స్క్రీనింగ్ కమిటీకి తమ బయోడేటాలను ఆశావహులు సమర్పించారు. ఈరోజు స్క్రీనింగ్ కమిటీకి మొత్తం 170 బయోడేటాలు అందినట్టు ఆ ప్రకటనలో తెలిపారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతానికి చెందిన జిల్లాల నుంచి ఆశావహులు ఎక్కువ మంది వచ్చినట్టు జనసేన పేర్కొంది.