kavitha: కవితతో భేటీ అయిన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు

  • కుటుంబ సమేతంగా కవిత నివాసానికి వెళ్లిన ఎర్రబెల్లి
  • మంత్రి పదవి చేపట్టిన ఎర్రబెల్లికి శుభాకాంక్షలు తెలిపిన కవిత
  • కేసీఆర్ తనకు మంచి శాఖ ఇచ్చారన్న ఎర్రబెల్లి
టీఆర్ఎస్ ఎంపీ కవితతో తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు భేటీ అయ్యారు. హైదరాబాదులోని కవిత నివాసానికి ఈ ఉదయం ఎర్రబెల్లి కుటుంబ సమేతంగా వచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి బాధ్యతలను చేపట్టిన ఎర్రబెల్లికి కవిత శుభాకాంక్షలు తెలిపారు. ఎర్రబెల్లితో పాటు ఆయన సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తదితరులు కూడా కవితను కలిసినవారిలో ఉన్నారు. అనంతరం ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు మంచి శాఖను ఇచ్చారని కృతజ్ఞతలు తెలిపారు.

ఎర్రబెల్లి ఇప్పటి వరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్టీఆర్ హయాంలోనే ఆయనకు మంత్రి పదవి దక్కాల్సి ఉన్నప్పటికీ... అదృష్టం కలసి రాలేదు. చంద్రబాబు హయాంలో కూడా నిరాశే ఎదురైంది. ఇప్పుడు కేసీఆర్ ద్వారా ఆయన చిరకాల స్వప్నం నెరవేరింది.
kavitha
TRS
Errabelli
meeting

More Telugu News