salman khan: పాక్ గాయకుడిని తొలగించిన సల్మాన్ ఖాన్

  • సల్మాన్ సొంత బ్యానర్ పై తెరకెక్కుతున్న 'నోట్ బుక్'
  • ఓ పాట కోసం పాక్ గాయకుడిని తీసుకున్న సల్మాన్
  • ఉగ్రదాడి నేపథ్యంలో అతన్ని తొలగించిన వైనం
పుల్వామాలో భారత జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని బాలీవుడ్ ఖండించింది. ఇప్పటికే పాకిస్థానీ నటులపై నిషేధం విధించింది. తాజాగా స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన తాజా చిత్రం నుంచి పాకిస్థానీ గాయకుడు అతిఫ్ అస్లాంను తొలగించాడు. తన సొంత బ్యానర్ సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ ద్వారా తెరకెక్కుతున్న 'నోట్ బుక్' చిత్రంలో ఒక పాట కోసం అతిఫ్ అస్లాంను సల్మాన్ తీసుకున్నాడు. కొన్ని రోజుల్లో ఈ పాట రికార్డింగ్ జరగాల్సి ఉంది. ఈలోపు ఉగ్రదాడి జరగడంతో... దానిని నిరసిస్తూ సల్మాన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఆయన స్థానంలో మరో గాయకుడిని తీసుకోనున్నాడు.
salman khan
note book
Pakistan
singer
atif aslam
Bollywood

More Telugu News