akhil: 'బొమ్మరిల్లు' భాస్కర్ తోనే అఖిల్ నెక్స్ట్ మూవీ

  • అఖిల్ కి వరుస పరాజయాలు
  • తదుపరి సినిమా గీతా ఆర్ట్స్ లో
  • మార్చిలో లాంచ్ కి సన్నాహాలు

అఖిల్ తొలి సినిమాలు మూడూ కూడా భారీ బడ్జెట్ తో రూపొందినవే. అఖిల్ వయసుకి తగినట్టుగా ఈ మూడు సినిమాలు కూడా యూత్ ను దృష్టిలో పెట్టుకునే తెరకెక్కాయి. అయితే ఇవేవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో అఖిల్ వున్నాడు. ఆయన నాల్గొవ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్లో వుండనున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ సినిమా దర్శకుల జాబితాలో పరశురామ్ .. 'బొమ్మరిల్లు' భాస్కర్ పేర్లు వినిపించాయి.

తాజాగా 'బొమ్మరిల్లు' భాస్కర్ నే ఖరారు చేశారని తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని కూడా చెప్పుకుంటున్నారు. మార్చిలో లాంచ్ చేసి .. ఏప్రిల్లో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతారట. చాలాకాలం క్రితం వచ్చిన 'బొమ్మరిల్లు' .. భాస్కర్ ఇంటిపేరుగా మారిపోయేంతటి విజయాన్ని సాధించింది. ఆ తరువాత ఆయన నుంచి వచ్చిన సినిమాలు పెద్దగా ఆదరణ పొందలేదు. అఖిల్.. గీతా ఆర్ట్స్ కాంబినేషన్లోని సినిమా, భాస్కర్ తనని తాను నిరూపించుకునే మంచి అవకాశమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

More Telugu News