Telangana: తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు

  • పది మంది మంత్రులుగా ఈరోజు ప్రమాణ స్వీకారం 
  • వారిక శాఖలు కేటాయించిన సీఎం కేసీఆర్
  • ఈటలకు వైద్య, ఆరోగ్యశాఖ

తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ఈరోజు ఉదయం జరిగిన విషయం తెలిసిందే. రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ పది మంది ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎం కేసీఆర్ ఆ పది మంత్రులకు ఈ సాయంకాలం శాఖలు కేటాయించారు.

మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు...

వైద్య, ఆరోగ్య శాఖ-  ఈటల రాజేందర్
పశు సంవర్థక శాఖ- తలసాని శ్రీనివాస్ యాదవ్
విద్యాశాఖ- జగదీశ్ రెడ్డి
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్ డబ్ల్యూఎస్- ఎర్రబెల్లి దయాకర్ రావు
న్యాయశాఖ, దేవాదాయ, అడవులు, పర్యావరణ శాఖ- అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
సంక్షేమ శాఖ- కొప్పుల ఈశ్వర్
రవాణా, రోడ్లు, భవనాల శాఖ- వేముల ప్రశాంత్ రెడ్డి
వ్యవసాయ శాఖ- సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ఎక్సైజ్, పర్యాటకం, క్రీడలు- వి.శ్రీనివాస్ గౌడ్
కార్మిక, ఉపాధి, మానవ వనరుల అభివృద్ధి- చామకూర మల్లారెడ్డి

More Telugu News