paruchuri: ముందుగా విన్నప్పుడు 'గ్యాంగ్ లీడర్' కథ చిరంజీవిగారికి నచ్చలేదు: పరుచూరి గోపాలకృష్ణ

  • విజయబాపినీడు కథ చెప్పారు
  • చిరంజీవి గారు నచ్చలేదన్నారు
  •  మార్పులు చేర్పులు చేశాము  

తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, దర్శకుడు విజయబాపినీడుతో తనకి గల అనుబంధం గురించి ప్రస్తావించారు. "మా అన్నయ్యకి .. విజయ బాపినీడుకి మధ్య మంచి అనుబంధం వుంది. మా తమ్ముడు మంచి రైటర్ అని మా అన్నయ్య నన్ను పరిచయం చేసినప్పుడు, 'మద్రాస్ రావచ్చు గదా' అని ఆయన అన్నారు. అప్పటికి నేను ఇంకా ఉయ్యూరులో అధ్యాపక వృత్తిలోనే వున్నాను.

ఆ తరువాత కొంత కాలానికి నేను .. అన్నయ్య 'అశోక హోటల్'లో ఉండగా, విజయ బాపినీడుగారు వచ్చారు. చిరంజీవితో ఒక సినిమా చేయాలనే ఉద్దేశంతో కథ వినిపించాననీ, ఆ కథ ఆయనకి నచ్చలేదని చెప్పారు. ఒకసారి ఆ కథ నాకు చెప్పండి అంటే చెప్పారు. కథలో లోపాలు ఎక్కడ ఉన్నాయో నాకు అర్థమైపోయింది. దాంతో నేను సరి చేస్తాను .. చిరంజీవి గారికి మళ్లీ కథ చెబుదాము అన్నాను. చిరంజీవి గారికి ఫోన్ చేస్తే .. సరే అన్నారు. మూడో రోజే వెళ్లి .. మార్పులు చేసిన కథ చెప్పాను. 'బాగుంది .. చేస్తాను' అన్నారు .. ఆ సినిమాయే 'గ్యాంగ్ లీడర్' అంటూ చెప్పుకొచ్చారు.

More Telugu News