Andhra Pradesh: గుంటూరు జిల్లా టీడీపీలో కుమ్ములాట.. రోడ్డుపైనే కొట్టుకున్న రెండు గ్రూపులు!

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో టీడీపీ నేతలు బాహాబాహీకి దిగారు. జిల్లాలోని తాడికొండ నియోజకవర్గంలో జెడ్పీ మాజీ చైర్మన్ పూర్ణచంద్రరావు చంద్రబాబు మళ్లీ సీఎం కావాలంటూ పాదయాత్ర చేపట్టారు. అయితే ఈ యాత్ర వెంకటపాలెంకు చేరుకోగానే ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ వర్గీయులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మాటామాటా పెరగడంతో ఇరువర్గాలు రోడ్డుపైనే ఘర్షణకు దిగాయి.

వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేశారు. కాగా, ఈ సందర్భంగా పూర్ణచంద్రరావు మాట్లాడుతూ.. శ్రావణ్ కుమార్ కు ఈసారి పార్టీ టికెట్ ఇవ్వరాదని తెలిపారు. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాగా, ఈ ఘర్షణ విషయమై టీడీపీ అధినాయకత్వం ఇంతవరకూ స్పందించలేదు.
Go Back to Shorts
Andhra Pradesh
Chandrababu
Telugudesam
Guntur District
fight
tadikonda

More Telugu News