ACB: 'ఓటుకు నోటు' అప్ డేట్... నేడు రేవంత్ రెడ్డిని విచారించనున్న ఈడీ!

  • సంచలనం సృష్టించిన 'ఓటుకు నోటు'
  • విచారణను వేగవంతం చేసిన ఈడీ
  • ఏసీబీ చార్జ్ షీట్ ఆధారంగా విచారణ

మూడేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో 'ఓటుకు నోటు' కేసు ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కేసులో అప్పట్లో టీడీపీ నేతగా, ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి జైలుకు కూడా వెళ్లి వచ్చారు. కేసులో ఏపీ సీఎం చంద్రబాబు పేరూ అభియోగ పత్రంలో చేర్చబడింది. ఈ కేసులో ఎన్ ఫౌర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణను వేగవంతం చేసింది.

ఈ క్రమంలో ఇప్పటికే ఉదయసింహను విచారించి, స్టీఫెన్ సన్ వద్దకు తీసుకెళ్లిన రూ. 50 లక్షలు ఎక్కడివన్న కోణంలో విచారించింది. ఇక నేడు రేవంత్ రెడ్డిని ఈడీ మరోసారి ప్రశ్నించనుంది. ఆయన్ను కూడా డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చారన్న విషయంలోనే ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారని సమాచారం. ఈ కేసులో గతంలో తెలంగాణ ఏసీబీ వేసిన చార్జ్ షీట్ ఆధారంగా విచారణను ముందుకు తీసుకెళుతున్నట్టు ఈడీ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయానికి రావాలని రేవంత్ కు మూడు రోజుల క్రితమే నోటీసులు వెళ్లిన సంగతి తెలిసిందే.

More Telugu News