Texas: టెక్సాస్ లో భార్య శాంతిని కాల్చి చంపి, తనను తాను కాల్చుకున్న శ్రీనివాస్!

  • టెక్సాస్ లో తెలుగు యువకుడి దారుణం
  • కుటుంబ కలహాలతో భార్య హత్య
  • మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు
టెక్సాస్ లో ఓ తెలుగు యువకుడు దారుణానికి తెగబడ్డాడు. కుటుంబ కలహాల కారణంతో తన భార్యను చంపి, తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, తెలుగు సంఘాల నాయకులు వెల్లడించిన వివరాల ప్రకారం, నెకరకంటి శ్రీనివాస్ అనే వ్యక్తి, ఇక్కడి ఓ ఇంధన కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, అతనికి భార్య శాంతి, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.

 నిన్న ఆ ఇంటి నుంచి తుపాకీ శబ్దాలు వినిపించడంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వచ్చారు. అప్పటికే శాంతి, శ్రీనివాస్ లు విగత జీవులుగా కనిపించారు. ఆ సమయంలో వీరి కుమార్తె ఇంట్లోనే తన గదిలో ఉండగా, కుమారుడు చదువు నిమిత్తం కాలేజీకి వెళ్లాడని పోలీసులు తెలిపారు. శ్రీనివాస్, శాంతి మధ్య గొడవ ఎందుకు జరిగిందన్న విషయమై కుమార్తె వద్ద సమాచారం లేదని, కేసును విచారిస్తున్నామని తెలిపారు.
Texas
Police
Srinivas Nekarakanti
Shanti

More Telugu News