Jyothi: అత్యాచారం చేయలేదు... జ్యోతి హత్య కేసులో వీడిన మిస్టరీ!

షార్ట్స్‌లో చూడండి
అమరావతి ప్రాంతంలో పెను కలకలం రేపిన జ్యోతి హత్యకేసును మంగళగిరి పోలీసులు ఛేదించారు. జ్యోతిని తన బైక్ పై ఎక్కించుకుని వెళ్లిన ప్రియుడు శ్రీనివాసే ప్రధాన నిందితుడని తేల్చారు. జ్యోతిని హత్య చేసేందుకు తన స్నేహితుడు పవన్ సహకారాన్ని తీసుకున్నాడని, జ్యోతితో వాగ్వాదం తరువాత ఆమె కాళ్లు, చేతులను శ్రీనివాస్ గట్టిగా పట్టుకోగా, పవన్ ఓ ఇనుపరాడ్డుతో ఆమె తలపై బలంగా కొట్టాడని, ఆమె మరణించిందని నిర్ధారించుకున్న తరువాత, తనపై ఎవరికీ అనుమానం రాకూడదన్న ఉద్దేశంతో శ్రీనివాస్, తన తలపైనా కొట్టించుకున్నాడని పోలీసు అధికారులు తేల్చారు.

శ్రీనివాస్ గతంలోనూ ప్రేమ పేరిట అమ్మాయిలకు దగ్గరై, వారిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, సన్నిహితంగా గడిపి, వారి నగ్న వీడియోలు సేకరించి బ్లాక్‌ మెయిల్‌ చేసినట్టు గుర్తించామని అన్నారు. ఈ కేసులో శ్రీనివాస్ కు కఠిన శిక్ష పడేలా చూస్తామని జ్యోతి బంధువులకు హామీ ఇచ్చారు. హత్యకు ముందు ఆమెపై అత్యాచారం జరగలేదని స్పష్టం చేశారు. హత్య తరువాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ డిశ్చార్జ్ కాగా, ఆ వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.
Go Back to Shorts
Jyothi
Amaravati
Srinivas
Murder

More Telugu News