aanand devarakonda: విజయ్ దేవరకొండ కోసం వెయిట్ చేస్తోన్న 'దొరసాని' టీమ్

  • శివాత్మిక ప్రధాన పాత్రధారిగా 'దొరసాని'
  • హీరోగా ఆనంద్ దేవరకొండ
  • త్వరలోనే ప్రమోషన్స్ మొదలు  

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ 'దొరసాని' సినిమా షూటింగుతో బిజీగా వున్నాడు. రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక ఈ సినిమాలో కథానాయిక. ఆనంద్ దేవరకొండ .. శివాత్మిక ఈ సినిమాతోనే పరిచయం కానున్నారు. తెలంగాణ నేపథ్యంలో సాగే కథ కావడంతో, వరంగల్ .. సిద్ధిపేటలలో ఎక్కువభాగం చిత్రీకరణ జరిపారు. ఇప్పటికే ఈ సినిమా 90 శాతం చిత్రీకరణను జరుపుకుంది.

ఫస్టులుక్ తో ప్రమోషన్స్ మొదలు పెట్టడానికి ఈ సినిమా టీమ్ సిద్ధమవుతోంది. విజయ్ దేవరకొండ .. రాజశేఖర్ల చేతులమీదుగా ఈ సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టాలనుకుంటున్నారట. ఒక వైపున విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్' షూటింగుతోను .. మరో వైపున 'కల్కి' సినిమా షూటింగుతో రాజశేఖర్ బిజీగా వున్నారు. ఈ ఇద్దరికీ సమయం దొరగ్గానే ప్రమోషన్స్ ను స్టార్ట్ చేస్తారట. మధుర శ్రీధర్ .. యష్ రంగినేని నిర్మిస్తోన్న ఈ సినిమాకి, మహేంద్ర దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. 

More Telugu News