పుల్వామా ఘటన మరువకముందే కశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్.. నలుగురు భద్రతా సిబ్బంది వీర మరణం
- పుల్వామాలోనే మొన్నటి ఘటనకు సమీపంలోనే ఎన్‌కౌంటర్
- అమరుల్లో ఆర్మీ మేజర్
- నక్కి ఉగ్రవాదుల కోసం వేట
అమరులైన భద్రతా సిబ్బంది 55 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన వారు. కాగా, ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులు ఇంకా ఆ ప్రాంతంలో నక్కి ఉన్నట్టు అనుమానిస్తున్నారు. వారి కోసం భద్రతా దళాలు వేట ప్రారంభించాయి. కాగా, ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ పౌరుడు కూడా మృతి చెందినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 14న జైషే మహమ్మద్ ఉగ్రవాది అదిల్ అహ్మద్ దర్ జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే.