వైసీపీకి ఒక్కసారి అవకాశమివ్వండి.. గెలిపించండి: వైఎస్ జగన్

17-02-2019 Sun 18:59
  • బీసీలను కరివేపాకులా వాడుకున్న వ్యక్తి చంద్రబాబు
  • ఇటువంటి వ్యక్తిని 2019 ఎన్నికల్లో ఓడించాలి
  • మా పార్టీని గెలిపిస్తే మంచి పనులు చేస్తాం
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి ఒక్కసారి అవకాశమిచ్చి గెలిపించాలని ఆ పార్టీ అధినేత జగన్ కోరారు. ఏలూరులో వైసీపీ నిర్వహించిన ‘బీసీ గర్జన’ సభలో జగన్ మాట్లాడుతూ, గతంలో బీసీలకు చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలను ఒక్కసారి చూడాలని, వాటిల్లో ఎన్ని అమలు చేశారో చూసి నిర్ణయం తీసుకోమని కోరారు.

బీసీలను కరివేపాకులా వాడుకున్న వ్యక్తి చంద్రబాబు అని, ఇటువంటి వ్యక్తిని 2019 ఎన్నికల్లో ఓడించి, తమ పార్టీని గెలిపించాలని కోరారు. తమను గెలిపిస్తే వచ్చే ఐదేళ్లలో మంచి పనులు చేస్తామని, ఆ మంచి పనుల గురించి చెప్పి 2024 ఎన్నికల్లో మళ్లీ మిమ్మల్ని ఓట్లు వేయమని అడుగుతామని అన్నారు. నవరత్నాలు అమల్లోకి రావాలంటే అందరి చల్లని దీవెనలు తనకు కావాలని జగన్ కోరారు.