మేడ్చల్ రోడ్డుపై కారు బీభత్సం.. ఒకరి మృతి, ఐదుగురికి తీవ్రగాయాలు!
- మేడ్చల్ జిల్లాలోని శామీర్ పేటలో ఘటన
- ప్రమాదం అనంతరం పరారైన డ్రైవర్
- కేసు నమోదుచేసిన పోలీసులు
ఈ విషయమై శామీర్ పేట ఎస్సై రజాక్ మాట్లాడుతూ..దేవరయంజాల్, మందాయపల్లి గ్రామాలకి చెందిన ఆరుగురు కూలీలు పని నిమిత్తం అలంకృత రిసార్టుకు వెళుతున్నారని తెలిపారు. అంతలోనే వేగంగా వచ్చిన ఓ కారు అదుపు తప్పి వీరిని ఢీకొట్టిందన్నారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయిందని పేర్కొన్నారు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు 108 అంబులెన్సుకు సమాచారం అందించారన్నారు. ఈ ఘటనలో దేవరయంజాల్ గ్రామానికి చెందిన లక్ష్మి(40) అక్కడికక్కడే చనిపోయిందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామనీ, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నామని ఎస్సై రజాక్ తెలిపారు.