Tollywood: 'మహానాయకుడి'గా బాలా మావయ్య నటన నభూతో.. నభవిష్యతి!: నారా లోకేశ్

  • ట్రైలర్ అత్యద్భుతంగా, ఆసక్తికరంగా ఉంది
  • నిన్న విడుదలైన మహానాయకుడు ట్రైలర్
  • ట్విట్టర్ లో స్పందించిన ఏపీ ఐటీ మంత్రి
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జీవితంపై క్రిష్ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. నిన్న సాయంత్రం ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత, ఏపీ ఐటీ, పంచాయతీ రాజ్ మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియాలో స్పందించారు. మహానాయకుడు ట్రైలర్ అద్భుతంగా, ఆసక్తికరంగా ఉందని వ్యాఖ్యానించారు.

నారా లోకేశ్ ట్విట్టర్ లో స్పందిస్తూ..‘వెండితెర ఇలవేల్పు, తెలుగువారి ఆరాధ్య నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి బయోపిక్ లో రెండవ భాగం 'మహా నాయకుడు' చిత్రం ట్రైలర్ అత్యద్భుతంగా, ఆసక్తిని రేకెత్తిస్తోంది. మహా నాయకుడిగా బాలా మావయ్య నటన నభూతో నభవిష్యతి’ అని ట్వీట్ చేశారు.
Tollywood
ntr mahanayakudu
Balakrishna
super acting
Nara Lokesh
Telugudesam
Andhra Pradesh
Twitter

More Telugu News